ఐటీ సిస్టమ్స్ అనలిస్ట్‌గా పనిచేసే భారత సంతతికి చెందిన 8నెలల గర్భిణి సమన్విత ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కారు ఢీకొని మృతి చెందారు. 33 ఏళ్ల ఆమె తన భర్త, మూడేళ్ల కొడుకుతో కలిసి రోడ్డు దాటుతుండగా ఇది జరిగింది. తొలుత సమన్విత కుటుంబాన్ని చూసి కియా కార్నివాల్ కారు వేగం తగ్గించుకోగా, దానిని 19 ఏళ్ల యువకుడు నడుపుతున్న BMW వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి కియా కారు ముందుకు దూసుకెళ్లి సమన్వితను ఢీకొంది.
short by
srikrishna /
10:46 am on
19 Nov