ఆదివారం గౌహతిలో జరిగిన IPL 2025 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) చేతిలో ఆరు పరుగుల తేడాతో ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు IPLలో 100వ ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో RR మొత్తం 182/9 స్కోరు చేసి CSKని 176/6కి పరిమితం చేసింది. దీంతో IPL 2025లో RR తమ తొలి విజయాన్ని నమోదు చేయగా, CSK వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడింది. RR తరపున నితీశ్ రాణా 81(36) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
short by
Devender Dapa /
12:07 am on
31 Mar