భారతీయ రైల్వేస్ ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫాం అయిన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సేవల్లో గురువారం భారీ అంతరాయం ఏర్పడింది. వినియోగదారులు, దాని వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ను యాక్సెస్ చేయలేకపోయారు. నిర్వహణ పనులు చేపట్టడం వల్ల, ఈ-టికెట్ సేవలు అందుబాటులో ఉండవని ఆ సంస్థ వెబ్‌సైట్‌లో పేర్కొంది. దీనిపై ప్రయాణికుల నుంచి ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
short by
Srinu Muntha /
12:23 pm on
26 Dec