జమ్ముకశ్మీర్ కిష్త్వార్‌లోని చీనాబ్ ఉపనది మారుసుదర్‌పై పాకల్ దుల్ ఆనకట్టకు ఓవర్ హెడ్ ట్రాన్స్‌మిషన్ లైన్లు వేయడానికి భారత ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. సింధు జలాల ఒప్పందం కిందకు వచ్చే నదులపై నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు గానూ ఆనకట్ట పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. అదే జరిగితే ఒప్పంద నదులపై నీటిని నిల్వ చేయగల మొదటి ఆనకట్ట కూడా ఇదే అవుతుంది.
short by
/
10:32 pm on
06 May