ఎస్‌ఎల్‌బీసీ ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. టన్నెల్‌లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు జరుగుతున్న సహాయక చర్యలపై ఆయన ఆరా తీశారు. వీరిద్దరూ దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడుకున్నట్లు తెలంగాణ సీఎంవో తెలిపింది. శనివారం టన్నెల్‌లోని 14వ కిలోమీటర్ వద్ద 3 మీటర్ల మేర పైకప్పు కూలడంతో 8 మంది కార్మికులు లోపలే చిక్కుకుపోయారు.
short by
Srinu Muntha /
11:33 am on
23 Feb