ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి శనివారం ఒక్క రోజే రూ.3.71 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. ఇందులో అత్యధికంగా TG 09 F 0001 నంబర్‌కు రూ.7.75 లక్షలు వచ్చాయి. సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ నంబర్‌ను సొంతం చేసుకున్నారని అధికారులు పేర్కొన్నారు. TG 09 F0009 నంబర్‌ను రూ.6.70 లక్షలకు కమలయ్య హై స్టాప్ సంస్థ కొనుగోలు చేసింది.
short by
Devender Dapa /
10:10 pm on
19 Apr