గుజరాత్‌లోని మొదాసా పట్టణం వద్ద సోమవారం అర్ధరాత్రి అంబులెన్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరోజు వయసున్న బాలుడు, శిశువు తండ్రితో పాటు 30 ఏళ్ల డాక్టర్, 23 ఏళ్ల నర్సు సజీవదహనం అయ్యారు. అప్పుడే పుట్టిన శిశువు అస్వస్థతకు గురికావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం మొదాసా నుంచి అహ్మదాబాద్‌కు అంబులెన్స్‌లో తీసుకెళ్తుండగా ఇది జరిగింది. వాహన ముందు భాగంలో ఉన్న ముగ్గురు గాయాలతో బయటపడ్డారు.
short by
srikrishna /
04:26 pm on
18 Nov