శ్రీకాకుళం జిల్లా డొంకూరు సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఆటో దగ్ధమైంది. గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తి ఒడిశాకు వెల్లి తిరిగి వస్తుండగా ఆటోలో మంటలు చెలరేగాయి. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి ఆటోలో ఉన్న ప్రయాణికులను కిందికి దింపేయడంతో ప్రాణాపాయం తప్పింది. ఆటో మంటల్లో పూర్తిగా కాలిపోయింది. తన జీవనాధారం కోల్పోయానని ఆటో యజమాని రవి ఆవేదన వ్యక్తం చేశాడు.
short by
Bikshapathi Macherla /
10:44 pm on
11 Mar