అనంతపురం జిల్లాలో గతేడాది అరటి టన్ను రూ.28 వేలకు పైగా పలకగా, ఈసారి రూ.1,000కి పడిపోయింది. వ్యాపారస్థుల దోపిడీతో పాటు మహారాష్ట్ర నుంచి వచ్చే అరటి మరింత నాణ్యంగా ఉండటమే ధరల తగ్గుదలకు ప్రధాన కారణాలని చెబుతున్నారు. పట్టణాల్లో డజను అరటి పళ్ల ధర రూ.40-70 ఉన్నా, రైతులకు రూ.15 కూడా దక్కడం లేదు. ఈ క్రమంలో కొందరు రైతులు అరటికాయలను మూగజీవాలకు ఆహారంగా పారబోశారు, మరికొందరు తోటను తొలగించి చదును చేస్తున్నారు.
short by
srikrishna /
11:57 am on
21 Nov