పేసర్ మోహిత్ శర్మ అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇన్నాళ్లు మద్దతుగా నిలిచిన BCCI, హర్యానా క్రికెట్ అసోసియేషన్, సహచర ఆటగాళ్లు, IPL ఫ్రాంఛైజీలు, సహాయక సిబ్బంది, కుటుంబ సభ్యులు, స్నేహితులకు మోహిత్ కృతజ్ఞతలు తెలిపాడు. మోహిత్ భారత్ తరపున 26 వన్డేలు, 8 టీ20లు ఆడాడు. 37 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టాడు. 2015లో భారత వన్డే ప్రపంచ కప్, 2014లో టీ20 ప్రపంచకప్ జట్లలో సభ్యుడిగా ఉన్నాడు.
short by
/
10:48 pm on
04 Dec