హైదరాబాద్ సరూర్‌నగర్‌లో అనుమతి లేకుండా కిడ్నీ మార్పిడి సర్జరీలు చేస్తున్న అలకనంద ఆసుపత్రిపై పోలీసులు, అధికారులు దాడులు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి అమాయకులకు డబ్బు ఆశ చూపి ఈ సర్జరీలు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ దాడుల్లో కిడ్నీ దాతలైన ఇద్దరు తమిళ మహిళలు, కర్ణాటకకు చెందిన ఇద్దరు గ్రహీతలను గుర్తించి వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అలకనంద ఆసుపత్రిని సీజ్ చేసి, వైద్యులను విచారిస్తున్నారు.
short by
Bikshapathi Macherla /
10:33 pm on
21 Jan