పాకిస్థాన్-యుఏఈ ఆసియాకప్ 2025 మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనిశ్చితి కొనసాగుతున్న వేళ, మ్యాచ్ అధికారికంగా ఒక గంట ఆలస్యం అయింది. షేక్‌హ్యాండ్ వివాదంపై మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలన్న పాకిస్థాన్ డిమాండ్‌ను.. ఐసీసీ తిరస్కరించగా మ్యాచ్‌ను బహిష్కరించాలని పీసీబీ తొలుత నిర్ణయించింది. కానీ ప్రస్తుతం చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. పాక్ ఆటగాళ్లు హోటల్ నుంచి మైదానానికి బయలుదేరినట్లు సమాచారం.
short by
Devender Dapa /
07:37 pm on
17 Sep