అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలోని పంట పొలాల్లో 15 అడుగుల భారీ గిరినాగు ప్రత్యక్షమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుక్కలు అరవడాన్ని గమనించి అటువైపు వెళ్లి చూడగా, గిరినాగు కనిపించిందని స్థానిక రైతులు తెలిపారు. మనషుల్ని చూడగానే పాము వారి మీదకు దూసుకెళ్లినట్లు వీడియోలో కనిపించింది. దీంతో రైతులు కేకలు వేస్తూ అక్కడి నుంచి దూరంగా పరుగులు తీశారు. ఆ తర్వాత పాము అడవిలోకి వెళ్లిపోయింది.
short by
Devender Dapa /
04:25 pm on
29 Mar