విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలో అప్పుడే పుట్టిన శిశువును ఓ తల్లి చెత్తకుప్పలో వదిలేసి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. తెల్లవారుజామున చిన్నారి ఏడుపులు వినిపించడంతో సాయిబాబా గుడి సమీపంలో శిశువును గుర్తించినట్లు వారు చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శిశువు వివరాలపై చుట్టుపక్కల వారిని ఆరా తీశారు. అనంతరం ఆచూకీ లభ్యం కాకపోవడంతో పాపను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
short by
Bikshapathi Macherla /
04:33 pm on
03 Dec