భారత అధికారులకు గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీ సహా మరికొందరు లంచం ఇవ్వజూపారని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ చేసిన ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండిస్తూ, అవన్నీ "నిరాధారం" అని పేర్కొంది. అవి నేరారోపణలు మాత్రమేనని, దోషులుగా రుజువయ్యే వరకు నిందితులను నిర్దోషులుగానే భావించాల్సి ఉంటుందని అదానీ గ్రూప్ తెలిపింది. న్యాయపరంగా ముందుకెళ్తామని చెప్పింది.
short by
Sri Krishna /
02:38 pm on
21 Nov