అమెరికాలోని అలబామా రాష్ట్రం బర్మింగ్‌హామ్‌లో తెలుగు విద్యార్థులు ఉంటున్న భవనంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, మరొకరికి తీవ్ర గాయాలైనట్లు రిపోర్ట్‌లు తెలిపాయి. ఏపీ, తెలంగాణకు చెందిన 10 మంది తెలుగు విద్యార్థులు ఆ భవనంలో నివాసం ఉంటూ అలబామా యూనివర్సిటీలో చదువుకుంటున్నట్టు తెలిసింది. మృతి చెందిన విద్యార్థులు హైదరాబాద్ వాసులని సమాచారం.
short by
Srinu /
10:11 pm on
05 Dec