అమెరికాలోని టెన్నెస్సీలో తన ప్రియురాలితో మంచంపై పడుకున్న వ్యక్తిని పెంపుడు కుక్క తుపాకీతో కాల్చింది. తాను పెంచుకుంటున్న పిట్‌బుల్ రకానికి చెందిన శునకం బెడ్‌పైకి దూకడంతో అకస్మాత్తుగా తుపాకీ పేలినట్లు బాధితుడు చెప్పాడు. అయితే కుక్క పాదం తుపాకీ ట్రిగ్గర్ గార్డ్‌లో చిక్కుకుందని, అందుకే కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. బుల్లెట్ బాధితుడి ఎడమతొడ పైభాగంలో దూసుకెళ్లడంతో అతడికి స్వల్ప గాయమైందన్నారు.
short by
Bikshapathi Macherla /
10:49 pm on
11 Mar