భవిష్యత్తులో అమరావతి, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ అన్నీ కలిపి మెగాసిటీగా ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రూపొందించారని మంత్రి పి.నారాయణ వెల్లడించారు. మెగాసిటీకి అంతర్జాతీయ విమానాశ్రయం అవసరమన్నారు. దాని నిర్మాణానికి 5 వేల ఎకరాలు కావాలని, ఆ మేరకు భూమి పరిశీలించాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో క్రీడా నగరాన్ని నిర్మించాలనే ఆలోచనా ఉందని చెప్పారు.
short by
srikrishna /
07:37 am on
16 Apr