కేరళలోని శబరిమల దర్శనానికి వెళ్లిన రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లికి చెందిన అయ్యప్ప భక్తుడు మల్లికార్జున రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. పంబ నదిలో స్నానం అనంతరం స్వామి సన్నిధానం చేరుకునే మార్గంలో పులిమెడ వద్ద ఆయన అస్వస్థతకు గురయ్యారు. స్థానికంగా ఉండే వైద్య సిబ్బంది మల్లికార్జున రెడ్డిని పరీక్షించగా, అప్పటికే ఆయన చనిపోయారు. ఇటీవల అధిక సంఖ్యలో తెలుగు రాష్ట్రాల భక్తులు శబరిమల దర్శనానికి వెళ్లారు.
short by
Srinu /
10:20 pm on
20 Nov