అల్లూరి జిల్లా అరకులో జరుగుతున్న చలిజాతర ఉత్సవాల్లో 10 రాష్ట్రాలకు చెందిన గిరిజన కళాకారులు సంప్రదాయ నృత్యాలు, డప్పు వాయిద్యాలతో ప్రదర్శనలు చేశారు. మారథాన్, ప్లవర్ షో, గిరిజన వంటకాలతో ఫుడ్ కోర్టులను జాతరలో ఏర్పాటు చేశారు. అనంతరం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు స్థానిక గిరిజనులతో కలిసి స్టెప్పులేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శుక్రవారం మొదలైన ఈ జాతర ఆదివారం వరకు జరగనుంది.
short by
Bikshapathi Macherla /
10:23 pm on
01 Feb