అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో బుధవారం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇందులో ఏడుగురు మావోయిస్టులు(ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు) మృతి చెందారు. మృతుల్లో శ్రీకాకుళానికి చెందిన మావోయిస్టు జోగారావు(టెక్ శంకర్) కూడా ఉన్నారు. కాగా, మంగళవారం కూడా మారేడుమిల్లిలో ఎన్‌కౌంటర్ జరగ్గా, మావోయిస్టు అగ్రనేత హిడ్మా, ఆయన భార్యతో పాటు మరో నలుగురు మావోయిస్టులు చనిపోయారు.
short by
srikrishna /
11:20 am on
19 Nov