అల్లూరి జిల్లాలో మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన మద్వి హిడ్మా స్వగ్రామం ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పువర్తి. అతడు 10వ తరగతి వరకే చదువుకున్నాడు. 17 ఏళ్ల వయసులోనే మావోయిస్టు పార్టీలో చేరాడు. భీకర గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా పేరొందిన 51 ఏళ్ల హిడ్మా భద్రతా బలగాలపై కనీసం 26 సాయుధ దాడులకు పథక రచన చేశాడు. 200 మందికి పైగా భద్రతా సిబ్బంది మృతికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమయ్యాడని సమాచారం.
short by
srikrishna /
01:26 pm on
18 Nov