కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ వీసీ డా.నందకుమార్ శుక్రవారం రాజీనామా చేశారు. పేపర్ల మూల్యాంకనంలో అవకవతకలతో పాటు ఇంఛార్జ్‌ల నియామకంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఉన్నతమైన వర్సిటీలో అస్తవ్యస్థ పరిస్థితులకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ క్రమంలో అనూహ్యంగా వీసీ నందకుమార్ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.
short by
Devender Dapa /
10:52 pm on
28 Nov