‘పుష్ప- ది రూల్’ బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద బుధవారం జరిగిన తొక్కిసలాటపై ఆ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ స్పందించింది. ‘‘నిన్న రాత్రి స్క్రీనింగ్ సమయంలో జరిగిన విషాద ఘటనతో మేం చాలా బాధపడ్డాం. ఈ క్లిష్ట సమయంలో వారికి అండగా నిలిచేందుకు అవసరమైన సాయం అందిస్తాం,’’ అని పేర్కొంది. ఈ తొక్కిసలాటలో 35 ఏళ్ల మహిళ చనిపోగా, ఆమె 9 ఏళ్ల కుమారుడు చికిత్స పొందుతున్నాడు.
short by
Srinu Muntha /
04:54 pm on
05 Dec