మీరు మీ సెల్‌ఫోన్‌ను చెక్ చేస్తే పై భాగంలో, దిగువన చిన్నపాటి రంధ్రం కనిపిస్తుంది. పై భాగంలో ఉండే రంధ్రం బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ తగ్గించడానికి, సిగ్నల్ ద్వారా కాల్స్ నాణ్యతను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. కింది భాగంలో ఉండే రంధ్రం మైక్రోఫోన్‌గా పనిచేస్తుంది. కాల్ మాట్లాడే సమయంలో ఇవి ఆటోమేటిక్‌గా ఆన్ అవుతాయి. ఈ రంధ్రాలను శుభ్రంగా ఉంచుకోవాలి, పిన్నులు వంటి వాటిని పెట్టకూడదు.
short by
Devender Dapa /
01:33 pm on
22 Nov