మహబూబ్‌నగర్ జిల్లా నంచర్ల గేట్ సమీపంలో ఆటోను టిప్పర్ లారీ ఢీకొనడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. నంచర్ల గేట్ వైపు నుంచి మహమ్మదాబాద్ వైపు వెళ్తున్న ఆటోను కోస్గి వైపు వెళ్తున్న టిప్పర్ ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆటో నడుపుతున్న హన్వాడ మండలానికి చెందిన కాట్రావత్ సునీల్ మృతి చెందాడు. మృతుని తల్లి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేశారు.
short by
Bikshapathi Macherla /
10:09 pm on
20 Apr