తూర్పు గోదావరి జిల్లా కొప్పవరంలో ఆడుకుంటూ వెళ్లి కాల్వలో పడి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. ఆడుకుంటూ బయటికి వెళ్లిన పాప కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పరిసరాలను గమనించిన పోలీసులు నీళ్లలో పడి ఉంటుందనే అనుమానంతో పరిశీలన చేపట్టి కొప్పవరానికి 12 కిలోమీటర్ల దూరంలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. ఫైర్ సిబ్బంది సాయంతో మృతదేహాన్ని బయటకు తీసి, పోస్టుమార్టంకు తరలించారు.
short by
Bikshapathi Macherla /
08:48 pm on
28 Mar