నటి కియారా అడ్వాణీ, నటుడు సిద్ధార్థ్ మల్హోత్ర దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. వారికి ఆడబిడ్డ జన్మించింది. ముంబయిలోని రిలయన్స్ ఆసుపత్రిలో కియారా ప్రసవించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఈ జంట ప్రకటించింది. 2023 ఫిబ్రవరి 7న కుటుంబ సభ్యుల సమక్షంలో రాజస్థాన్‌లో సిద్ధార్థ్, కియారా ప్రేమ వివాహం చేసుకున్నారు.
short by
srikrishna /
06:59 am on
16 Jul