ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌లోని PHCలోని ఒక గదిలో నవజాత శిశువుపై సీలింగ్ ఫ్యాన్ విరిగిపడిన ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (NHRC) సూమోటోగా కేసు నమోదు చేసింది. సమగ్ర నివేదిక ఇవ్వాలని, శిశువు తల్లికి రూ.50 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. 2 రోజుల క్రితం PHCలో ఓ ఆడ శిశువు జన్మించగా.. ఆదివారం తల్లి, శిశువు ఉన్న మంచంపై సీలింగ్ ఫ్యాన్ తెగిపడింది. శిశువుకు తల భాగంలో తీవ్ర గాయాలయ్యాయి.
short by
Devender Dapa /
10:52 pm on
24 Nov