ఆదివారం జరిగే గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు విశాఖలోని ఇసుకతోట కూడలి వద్ద హైవేపై బైఠాయించి ధర్నాకు దిగారు. రిజర్వేషన్‌లో రోస్టర్ విధానం సరిచేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలతో సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కాగా పరీక్షను వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం లేఖ రాయగా, షెడ్యూల్ ప్రకారం ఆదివారం పరీక్షను నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.
short by
Devender Dapa /
11:12 pm on
22 Feb