విశాఖ ద్వారకా బస్టాండ్‌లో సోమవారం ఆర్టీసీ అద్దె బస్సు అదుపు తప్పి ప్లాట్‌ఫాంపైకి దూసుకెళ్లింది. దీంతో అక్కడే ఉన్న విజయనగరం జిల్లా పోతనపల్లికి చెందిన 47 ఏళ్ల గేదెల ముత్యాలమ్మ పిల్లర్, బస్సు మధ్య నలిగిపోయి మృతి చెందింది. ఆమె గాజువాకలో తన మనవడి అన్నప్రాసనకు హాజరై తిరిగి వెళ్తూ ఎస్.కోట బస్సు కోసం వేచి ఉన్న సమయంలో ఇది జరిగింది. బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు.
short by
srikrishna /
10:18 am on
12 Aug