వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పోలీసులు బుధవారం ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో 41ఏ నోటీసులు ఇచ్చారు. ఆర్వోపై దురుసుగా ప్రవర్తించిన కేసులో ఇవాళ విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. గతేడాది ఏప్రిల్ 24న యర్రగొండపాలెం రిటర్నింగ్ అధికారి శ్రీలేఖను నామినేషన్ కేంద్రంలో బెదిరించారనే ఆరోపణలతో చెవిరెడ్డిపై అప్పట్లో కేసు నమోదైంది.
short by
srikrishna /
01:04 pm on
12 Mar