నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆహారాన్ని నెమ్మదిగా తినడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. జీర్ణక్రియ అనేది నోట్లోనే ప్రారంభమవుతుంది. మనం ఆహారాన్ని సరిగా నమలడం ద్వారా, అందులోని అమైలేస్ అనే ఎంజైమ్ కార్బోహైడ్రేట్లను విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తుంది. సరిగా నమలకుంటే, జీర్ణక్రియ జరగదు. అప్పుడు ప్రేగుల్లోని బ్యాక్టీరియా జీర్ణం కాని పిండి పదార్థాలపై పనిచేయడం వల్ల అధిక మొత్తంలో వాయువు ఉత్పత్తి అవుతుంది.
short by
/
02:12 pm on
04 Dec