తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండబోవని సినీ ప్రముఖులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నటీనటులు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. సినిమా టికెట్లపై విధించే సెస్సు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి వినియోగించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ప్రోత్సాహకాలను ప్రచారం చేయాలని, ప్రతి సినిమా ప్రదర్శన ముందు వీటిపై యాడ్ ప్లే చేయాలని చెప్పారు.
short by
Sri Krishna /
12:17 pm on
26 Dec