ఇటీవల తాను కొనుగోలు చేసిన కొత్త రేంజ్ రోవర్ నెంబర్ కోసం భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ మంగళవారం హైదరాబాద్ టోలిచౌకిలోని ఆర్టీవో కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా అతడితో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపించారు. పని ముగించుకుని సిరాజ్ అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులో మహమ్మద్ సిరాజ్‌కు చోటు దక్కలేదు. ప్రస్తుత రంజీ సీజన్‌లో అతడు ఆడనున్నాడు.
short by
Devender Dapa /
11:01 pm on
21 Jan