పైరసీ సినిమాలకు అడ్డాగా మారిన ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్లు మూతబడ్డాయి. శనివారం అరెస్టయిన ఐబొమ్మ నిర్వాహకుడు 40 ఏళ్ల ఇమ్మడి రవితోనే వాటిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు క్లోజ్ చేయించారు. అతడి వద్ద స్వాధీనం చేసుకున్న వందలాది హార్డ్ డిస్క్‌లను విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న రవిని కస్టడీకి తీసుకునేందుకు పోలీసులు సోమవారం నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ వేయనున్నారు.
short by
srikrishna /
10:20 am on
16 Nov