క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే గుండె వయసును 20 ఏళ్ల వరకు తగ్గించవచ్చని కార్డియోవాస్కులర్ సర్జన్ డా.జెరెమీ లండన్ తెలిపారు. దీనివల్ల ఎక్కువ కాలం మెరుగైన జీవనం గడపవచ్చని చెప్పారు. “వ్యాయామం చేయకపోతే వయసు పెరుగుతున్న కొద్దీ గుండె కండరాలు గట్టిపడతాయి. దీనివల్ల గుండెలోని ఎడమ జఠరిక వ్యాకోచ గుణం తగ్గిపోతుంది. ఇది గుండెపోటు, ఇతర గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది,” అని ఆయన వివరించారు.
short by
srikrishna /
07:34 am on
12 Aug