భారత ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖర్ ఈనెల 25, 26 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈనెల 25న మెదక్ జిల్లా కౌడిపల్లిలోని ICAR- కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించి, అక్కడ సేంద్రియ విధానంలో సాగు చేస్తున్న 500 మంది రైతులతో ముఖాముఖిలో పాల్గొననున్నారు. అదే రోజు రాత్రి కన్హా శాంతివనంలో బస చేస్తారు. 26న దిల్లీకి తిరిగి వెళ్తారు. ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి అధికారులతో సమీక్షించారు.
short by
Devender Dapa /
10:33 pm on
21 Dec