ఉద్యోగాల పేరిట మోసానికి పాల్పడిన వెల్త్ అండ్ హెల్త్ సంస్థ నిర్వాహకులను నంద్యాల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు ఉద్యోగం కావాలంటే రూ.3 లక్షలు డిపాజిట్ చేయాలని నిబంధన పెట్టి, నెలకు రూ.40వేల వేతనం ఇస్తామని చెప్పారు. ఇలా కడప, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో దాదాపు 1,200 మంది నుంచి డిపాజిట్లు వసూలు చేశారు. కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో బాధితులు ఆందోళనకు దిగడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
short by
Srinu /
10:54 pm on
17 Nov