బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే గ్లూకోజ్ జీవక్రియకు అంతరాయం కలిగి ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుందని చెన్నైలోని నెఫ్రాలజిస్ట్ చంద్రశేఖరన్ తెలిపారు. దీనివల్ల తర్వాత ఎక్కువ తింటామని, ఫలితంగా ఊబకాయం, మధుమేహం, కిడ్నీ సమస్యల ముప్పు పెరుగుతుందన్నారు. ఉదయాన్నే బ్రెడ్, ఊరగాయలు వంటివి తీసుకోవడం, చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారం తినడం, ప్రాసెస్ చేసిన మాంసం తీసుకునే అలవాట్ల వల్ల కిడ్నీల పనితీరు దెబ్బతింటుందని వివరించారు.
short by
srikrishna /
07:46 am on
28 Nov