ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్‌కు అజారుద్దీన్ పేరు తొలగించాలని అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య HCAను ఆదేశించారు. లార్డ్స్ క్రికెట్ క్లబ్ వేసిన పిటిషన్‌పై ఆయన శనివారం విచారణ చేపట్టారు. “HCA అధ్యక్షుడిగా అజారుద్దీన్ తన పేరు పెట్టుకోవాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం చెల్లదు. ఇందులో విరుద్ధమైన ప్రయోజనాలున్నాయి,” అని తీర్పునిచ్చారు. టికెట్లపై ఇకనుంచి ఆపేరు ప్రస్తావన ఉండొద్దని పేర్కొన్నారు.
short by
Devender Dapa /
10:27 pm on
19 Apr