ఎత్తైన భవనాలపైన ఎర్రటి లైట్లు ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం విమాన భద్రత. ఈ లైట్లను ఏవియేషన్ అబ్‌స్ట్రక్షన్ లేదా ఎయిర్ క్రాఫ్ట్ వార్నింగ్ లైట్లు అని అంటారు. రాత్రిపూట చీకటిలో, ముఖ్యంగా సరిగా కనిపించని సమయంలో విమానాలు సురక్షితంగా రాకపోకలు సాగించేలా చూడటమే దీని లక్ష్యం. ఈ లైట్లను పవర్ టర్బైన్లు, కమ్యూనికేషన్ టవర్లపై కూడా అమర్చుతారు. ఈ లైట్‌లు పైలట్‌లకు ఈజీగా కనిపిస్తాయి.
short by
/
11:00 pm on
06 May