గురువారం సినీ ప్రముఖులతో సమావేశమైన సీఎం రేవంత్‌రెడ్డిని నటుడు అక్కినేని నాగార్జున శాలువాతో సత్కరించి, నవ్వుతూ పలకరిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఆగస్టులో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాలును హైడ్రా కూల్చేయగా, అక్టోబర్‌లో అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో సంచలనం రేపిన ఈ పరిణామాల తర్వాత ఇవాళే సీఎం రేవంత్‌ను నాగార్జున తొలిసారిగా కలిశారు.
short by
Sri Krishna /
05:30 pm on
26 Dec