For the best experience use Mini app app on your smartphone
పోలీసు కాల్పుల్లో చనిపోయిన మావోయిస్టు నేత మడవి హిడ్మా కొద్దిరోజుల క్రితం ఛత్తీస్‌ఘడ్ బస్తర్‌లోని ఓ విలేఖరికి లేఖ రాసినట్లు నివేదికలు తెలిపాయి. ఆయుధాలు వీడి, లొంగిపోయే ముందు తాను కొన్ని అంశాలపై చర్చించాలనుకున్నట్లు ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. తమ భద్రతకు భరోసా కల్పిస్తే సరెండర్‌కు సిద్ధమని, లొంగుబాటు ప్రదేశాన్ని నిర్ణయించాల్సి ఉందని చెప్పారు. కాగా, అల్లూరి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆయన చనిపోయారు.
short by / 11:28 am on 19 Nov
For the best experience use inshorts app on your smartphone