బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళలు అసభ్య పదజాలంతో దూషణలకు దిగి పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు నుంచి విజయవాడ బయలుదేరిన ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులో జరిగింది. ఇరువైపుల బంధువులు వారికి మద్దతుగా నిలవడంతో గొడవ ముదిరి, ఆ ఇద్దరు నీళ్ల సీసాలతో దాడులు చేసుకున్నారు. బస్సును పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాలని ప్రయాణికులు కోరడంతో గొడవ సద్దుమణిగింది.
short by
srikrishna /
10:29 am on
15 Sep