ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. మార్చిలో ప్రక్రియ ప్రారంభించి, విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బోధనారుసుముల్ని చెల్లించాలని ఆ పార్టీ నేతలే ఇప్పుడు ఆందోళనలకు పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందన్నారు.
short by
Devender Dapa /
11:29 pm on
01 Feb