తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేల అనర్హత అంశానికి సంబంధించి దాఖలైన 3 వేర్వేరు పిటిషన్లను సోమవారం సుప్రీంకోర్టు విచారించింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై నిర్ణయం తీసుకునేందుకు శాసనసభ స్పీకర్‌కు మరో 4 వారాల గడువు ఇచ్చింది. ఈ అంశంపై 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని జులై 31న సుప్రీంకోర్టు ఆదేశించగా, విభిన్న కారణాల వల్ల ఆలోపు నిర్ణయం తీసుకోలేదంటూ స్పీకర్ మరో 2 నెలలు గడువు కోరిన క్రమంలో ఈ ఆదేశాలు ఇచ్చింది.
short by
srikrishna /
04:07 pm on
17 Nov