ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం సొరంగంలోకి వచ్చిన బురదను తొలగిస్తున్నామని, ఆదివారం ఉదయం సహాయక చర్యలు వేగవంతం అవుతాయన్నారు. ఇప్పటికే 33.5 కి.మీ పనులు పూర్తయ్యాయని, మరో 9.5 కి.మీ పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఆదివారం సాయంత్రం వరకు స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
short by
Devender Dapa /
11:33 pm on
22 Feb