శ్రీశైలం ఎడమగట్టు కాల్వ(ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో జరిగిన ప్రమాదానికి పూర్తి బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిదేనని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. ''సుంకిశాలలో రీటైనింగ్ వాల్ కూలిన ఘటన మరువకముందే మరో దుర్ఘటన జరగడం కాంగ్రెస్ సర్కారు వైఫల్యానికి నిదర్శనం. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కమీషన్ల వేటలో పర్యవేక్షణ గాలికొదిలేయడం, నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీపడటం వల్లే వరుస సంఘటనలు జరుగుతున్నాయి'' అని పేర్కొన్నారు.
short by
Sri Krishna /
05:49 pm on
22 Feb