నవంబర్ 22 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఆ తదుపరి 48 గంటల్లో ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అనంతరం ఇది నైరుతి బంగాళాఖాతంలో తుపానుగా బలపడుతుందని, ఇది ఏపీపై ప్రభావం చూపొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కొనసాగుతోంది.
short by
srikrishna /
09:07 am on
20 Nov